calender_icon.png 26 November, 2025 | 6:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ గులాబీ జెండానే పేద వర్గాలకు శ్రీరామరక్ష

26-11-2025 05:54:30 PM

నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య..

చిట్యాల (విజయక్రాంతి): ఎవరెన్ని ప్రలోభాలు పెట్టిన ఎన్ని ఇబ్బందులు పెట్టినా పోటీలో పార్టీ ఉండాల్సిందేనని, కేసీఆర్  గులాబీ జెండానే మన పేద వర్గాలకు శ్రీ రామరక్ష అని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం నార్కట్ పల్లి పట్టణ కేంద్రంలో చిట్యాల, నార్కట్ పల్లి మండల బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నల్గొండ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కోసమే కాంగ్రెస్ నాయకులు బతుకమ్మ చీరలతో హడావుడి చేస్తున్నారని, ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంక్షేమ పథకాలు గుర్తొస్తాయని, ఎన్ని ప్రలోభాలు పెట్టినా ప్రజలు స్పష్టమైన అవగాహనతోనే ప్రజలు ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ సర్కారు ప్రజలకు ఉన్న బాకీతోనే తీవ్ర ఓటమిని మూటకట్టుకోవడం ఖాయం అని,రిజర్వేషన్లలో కూడా అనేక అవకతవకలు జరిగాయని,బిఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి పార్టీ శ్రేణులు కృషి చెయ్యాలని తెలిపారు. ఎవరెన్ని ప్రలోభాలు పెట్టిన ఎన్ని ఇబ్బందులు పెట్టినా పోటీలో ఉండాల్సిందేనని, కేసీఆర్  గులాబీ జెండానే మన పేద వర్గాలకు శ్రీ రామరక్ష అని, ఈ నెల 29న జరిగే దీక్షా దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ  నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.