26-11-2025 05:58:28 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని సోఫీనగర్ గురుకుల పాఠశాలలో బుధవారం రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ తయారు చేశారని అందులో ప్రజలందరికీ సమాన హక్కులు కల్పించబడ్డాయని ప్రిన్సిపల్ డానియల్ తెలిపారు. విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.