calender_icon.png 26 November, 2025 | 6:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగం స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆచరించాలి

26-11-2025 06:02:56 PM

ఖానాపూర్ అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు మేస సతీష్ 

ఖానాపూర్ (విజయక్రాంతి): భారతదేశంలో రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరు ఆచరించి గౌరవించాలని ఖానాపూర్ అంబేద్కర్ యువజన సంఘం మండల శాఖ అధ్యక్షులు మేస సతీష్ అన్నారు. బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఖానాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అజయ్ మాట్లాడుతూ భారత దేశ సార్వభౌమత్వానికి వెన్నెముక మన భారత రాజ్యాంగం అని అన్నారు. కార్యక్రమంలో ఖానాపూర్ ఎస్సై రాహుల్ గైక్వాయిడ్ ,ఆత్మ కమిటీ చైర్మన్ తోట సత్యం, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం, కాంగ్రెస్ మండల అధ్యక్షులు దయానంద్, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు తాళ్లపల్లి రాజ గంగన్న, దేవతి రాజేశ్వర్, జన్నారపు శంకర్ ,నేత శ్యామ్, పరిమి సురేష్ ,అమానుల్లా ఖాన్ ,శ్రీహరి ,దామోదర్, తదితరులు పాల్గొన్నారు.