calender_icon.png 26 November, 2025 | 6:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

26-11-2025 05:56:14 PM

సుల్తానాబాద్ ఎస్సై వేణుగోపాల్ 

సుల్తానాబాద్ (విజయక్రాంతి): విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఎస్సై వేణుగోపాల్ అన్నారు, బుధవారం సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీవాణి జూనియర్ డిగ్రీ, పీజీ కళాశాలలో రామగుండం కమిషనరేట్  కళాబృందం వారిచే  డ్రగ్స్, షీ టీం,100 డయల్, సైబర్ క్రైమ్, మొదలైన వాటిపై అవగాహన సదస్సు ఆటపాటలతో ఏర్పాటు చేయడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సుల్తానాబాద్ ఎస్సై వేణుగోపాల్ పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు డ్రగ్స్ సైబర్ క్రైమ్ మొదలైన వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

అలాంటివి ఎక్కడ కనబడ్డా 100 కు డయల్ చేయాలని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్సై వేణుగోపాలును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తన పాటలతో విద్యార్థులను ఉత్తేజపరిచిన హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇలాంటి అవగాహన కార్యక్రమాల వల్ల విద్యార్థులు తమకు సమాజంలో ఏర్పడే కష్టాలు ఇబ్బందుల పట్ల ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలో తెలియజేశారు, ఈ కార్యక్రమంలో శ్రీ వాణి డిగ్రీ అండ్ పీజీ కళాశాల ప్రిన్సిపల్ బండారి కమలాకర్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బాలు, అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.