26-11-2025 06:04:05 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని గుడిమిట్టపల్లిలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం సుబ్రమణ్యశష్టి సందర్భంగా విశేష అభిషేకం అనంతరం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు. పూజారి పొలాస అశోక్ ఆధ్వర్యం లో ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ దేవాలయ నిత్య భక్తుడు తోడుపునూరీ రాజేంద్రప్రసాద్ తో పాటు భక్త బృందం పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.