13-09-2025 07:38:14 PM
చేర్యాల: టీఆర్ఎస్ఎంఏ ప్రైవేట్ పాఠశాలల ఆధ్వర్యంలో శనివారం సిద్దిపేట పట్టణంలోని విఎస్ఎస్ గార్డెన్ లో గురుపూజోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేర్యాల పట్టణంలోని పంచతంత్ర పాఠశాల నుండి ఇద్దరు ఉపాధ్యాయులు వర్ధిని స్నేహలను మాజీ మంత్రి హరీష్ రావు(Former Minister Harish Rao) ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రైవేటు పాఠశాల యజమాన్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్యామల మాట్లాడుతూ ఉపాధ్యాయులను సన్మానించడం మాకెంతో సంతోషమని అన్నారు. వారితో పాటు చంద్రిక, అనూష, రమాదేవి, ఉమా, శ్రావణి ,సుధా, అనూష, లాస్య పాల్గొన్నారు.