calender_icon.png 13 September, 2025 | 9:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫేక్ షూరిటీ పత్రాలతో కోర్టునే తప్పుదోవ పట్టించిన నిందితులు..

13-09-2025 07:42:31 PM

సంతకం ఫోర్జరీ కేసులో 17 మందిపై కేసు, 8 మంది అరెస్ట్..

వివరాలు వెల్లడించిన ఎస్పీ అఖిల్ మహాజన్... 

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వ అధికారి సంతకం ఫోర్జరీ చేసి, నకిలీ షూరిటీ డాక్యుమెంట్ లు సబిట్ చేసి బెయిల్ ఇప్పించడంలో కోర్టునే తప్పుదోవ పట్టించిన ఘటనలో బ్రోకరిజం చేసిన 17 మందిపై కేసులు నమోదు చేయగా, 8 మందిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్(District SP Akhil Mahajan) తెలిపారు. శనివారం ఆదిలాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. తలమడుగు మండలం కొత్తూరు గ్రామ పంచాయతీ కారోబార్ అభిలాష్ రెడ్డి, బ్రోకర్ సయ్యద్ ఇర్ఫాన్ ఓ కేసు విషయములో గ్రామ కార్యదర్శి రాహుల్ సంతకాన్ని ఫోర్జరీ చేసి, నకిలీ గృహ విలువ త్రాలను, పన్ను రసీదులను సృష్టించారన్నారు.

ఓ కేసులో నేరస్తులకు కోర్టు నుండి బెయిల్ ఇప్పించడంతో పాటు వాహనాన్ని, సెల్ఫోన్ ను రిలీజ్ చెయించారు. ఈ కేసులో తన సంతకాన్ని ఫోర్జరీ చేసారని కార్యదర్శి రాహుల్ ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశామన్నారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు 17 మంది పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టమన్నారు. ఇప్పటికే కేసులో 8 మందిని అరెస్టు చేశామని మిగతావారు పరారీలో ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో నిందితులు న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు. మీడియాలో సమావేశంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐ నాగ్ రాజ్ ఉన్నారు.