13-09-2025 07:36:46 PM
బచ్చన్నపేట,(విజయక్రాంతి): బచ్చన్నపేట మండల కేంద్రంలోని స్థానిక దుర్గమ్మ దేవస్థానం వద్ద బచ్చన్నపేట మండల భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు బంగారు మహేష్ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన పురస్కరించుకొని సేవ పక్షం కార్యక్రమానికి కార్యశాల సన్నహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కార్యదర్శి కాశెట్టి పాండు హాజరై వారు మాట్లాడుతూ... నరేంద్ర మోది జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు రాష్ట్ర పార్టీ ఇచ్చిన వివిధ సేవా కార్యక్రమాలు, మండల కేంద్రంలో, గ్రామాలలో విజయవంతంగా నిర్వహించాలి అని అన్నారు. అలాగే సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం అలగే, నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని దాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు.
అదేవిధంగా ఈ రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రైతులకు వరి కి ఇస్తానన్న బోనస్ ఇవ్వలేదు, రుణమాఫీ అందరి రైతులకు కాలేదు, యూరియా లభించక రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని అన్నారు. గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదని మరియు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రెడ్డి అభ్యర్థి ని నిలబెట్టినవారు తెలంగాణ రాష్ట్రం లో బీసీ రిజర్వేషన్ ఏర్పాటు చేస్తానంటే నమ్ముతారా అని, ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఎలక్షన్లు నిర్వహించడం లేదని అన్నారు ఈ ప్రభుత్వానికి ప్రజలపై చిత్తశుద్ధి లేదని తెలియజేశారు.