calender_icon.png 5 August, 2025 | 5:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్‌ నేరాలపై విద్యార్థులకు అవగాహన

24-07-2025 10:07:08 PM

తరిగొప్పుల (విజయక్రాంతి): సామాజిక మాధ్యమాల ద్వారా జరిగే మోసాలు, వేధింపులు, బెదిరింపులకు గురికాకుండా ఉండేందుకు సైబర్‌ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని తరిగొప్పుల ఏఎస్ఐ రాజయ్య(ASI Rajaiah) అన్నారు. గురువారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో విద్యార్థులకు సైబర్ నేరాలు, డ్రగ్స్ విషయాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ రాజయ్య మాట్లాడుతూ... ఆన్లైన్ ద్వారా మోసగాళ్లు ఎలా మోసం చేస్తారో... వాటిని ఎలా ఎదుర్కోవాలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. మొబైల్‌ ద్వారానే 80 శాతం సైబర్‌ నేరాలు జరుగుతున్నాయన్నారు.

పెరుగుతున్న సాంకేతికతను ఆసరాగా చేసుకుని సైబర్‌ నేరాలకు కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారని విద్యార్థులు అవగాహన పెంచుకుని ఇటువంటి మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా జాగృతం చేయాలన్నారు. విద్యార్థులు, యువత డ్రగ్స్, గంజాయి ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మహిళ రక్షణ, ఇతర సమస్యలపై డాయిల్ 100 కి సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ జానకి, హెడ్మాస్టర్ రవీందర్ నాయక్, మహిళ ఏఎస్ఐ నాగమణి, కానిస్టేబుల్ ప్రదీప్, విద్యార్థులు,పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.