calender_icon.png 2 May, 2025 | 11:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాధనాన్ని ప్రభుత్వం ఎందుకు వృథా చేస్తుంది?

02-05-2025 12:29:27 PM

భూసేకరణ మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వమే పూర్తి చేసింది

హైదరాబాద్: సాగునీరు రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి(Former Minister Singireddy Niranjan Reddy) అన్నారు. సాగునీరు రాకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పారు. భూసేకరణ మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వమే పూర్తి చేసిందని చెప్పారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ 90 శాతం పూర్తి అయ్యిందని తెలిపారు. పాలమూరు- రంగారెడ్డి ద్వారానే డిండికి నీరు ఇవ్వాలని గతంలో మేము కేసీఆర్ కు చెప్పామని సూచించారు. తక్కువ సమయంలో ఎక్కువ నీరు వస్తాయని మేము సూచిస్తే అధ్యయనాలకి ఒప్పుకున్నారని వెల్లడించారు. ప్రజాధనాన్ని ప్రభుత్వం ఎందుకు వృథా చేస్తుందని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. పిలిచిన టెండర్లను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు.