17-12-2025 12:00:00 AM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),డిసెంబర్16: తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ జన్మదిన వేడుకలను మంగళవారం మండల కేంద్రం అర్వపల్లిలో బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గుండగాని సోమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి,పేదలకు పండ్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్,మాజీ ఎంపీపీ మన్నె రేణుక లక్ష్మీనర్సయ్య యాదవ్,మాజీ జెడ్పిటీసీ దావుల వీరప్రసాద్ యాదవ్,
మాజీ ఎంపీటీసీ రామలింగయ్య,వివిధ గ్రామాల బీఆర్‌ఎస్ నూతన సర్పంచ్లు కర్నాటి వెంకన్న,బొడ్డు ఇందిరాసోమరాజు,నున్న యాదగిరి,మేడి వీరస్వామి,అంకిరెడ్డి వీరాంజనేయులు,వల్లపు గంగయ్య,కలకోట్ల శైలేందర్,వివిధ గ్రామాల ఉపసర్పంచ్లు,బీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
రక్తదాన శిబిరం
నల్గొండ టౌన్, డిసెంబర్ 16: తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ జన్మదిన సందర్భంగా BRSV రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా రెడ్ క్రాస్ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించిన అనంతరం BRS పార్టీ జిల్లా కార్యాలయంలో కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ నాయకత్వంలో పది సంవత్సరాలు విద్యార్థులందరినీ ఏకం చేసి ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించి తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కీలకపాత్ర పోషించారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో BRS పార్టీ పట్టణ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, BRSV రాష్ట్ర నాయకులు గాదె శివ,చల్ల కోటేశ్ యాదవ్, దూదిమెట్ల మహేష్, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు మారగోని గణేష్, దొడ్డ రమేష్, వీరమల్ల భాస్కర్, అంబడి ప్రణీత్, ఇటికాల రాము,సైదిరెడ్డి, నోముల క్రాంతి , లింగయ్య, రిజ్వాన్, ఇర్ఫాన్ ,నాగేంద్ర, జాన్ రెడ్డి శంకర్, శ్రీనివాస్ రెడ్డి, అరుణ్, వెంకన్న, శ్రీకాంత్,రాంబాబు, కుమార్ పాల్గొన్నారు.