calender_icon.png 21 August, 2025 | 12:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే

21-08-2025 12:53:36 AM

గంగాధర మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలను సందర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

చొప్పదండి, ఆగస్ట్20(విజయక్రాంతి): గంగాధర మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలను మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం సందర్శించారు. ఈ సందర్భం గా విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భో జనాన్ని పరిశీలించారు. బుధవారం రోజున చికెన్‌తో భోజనం వడ్డించినట్టు, నాన్ వెజ్ తినని విద్యార్థుల కోసం మిల్ మేకర్ వండినట్లు సిబ్బంది తెలిపారు.

సమస్యలు ఏమై నా ఉన్నాయా, భోజనం ఎలా ఉంది, స్నానాలకు నీరు సక్రమంగా వస్తోందా, స్వచ్ఛమైన త్రాగునీరు అందజేస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. భోజనం, సౌక ర్యాలపై విద్యార్థులు సంతృప్తిని వ్యక్తం చేశా రు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకు లు మంత్రి మహేందర్, దోర్నాల శ్రీనివాస్ రెడ్డి, బూరుగు గంగన్న  మాట్లాడుతూ మా జీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ గురుకుల పా ఠశాలను సందర్శించి విద్యార్థులకు నాణ్యమై న భోజనం అందడం లేదని, సౌకర్యాలు స క్రమంగా లేవని సిబ్బందిని, విద్యార్థులను భ యాందోళనకు గురిచేసి అబద్ధాలు మాట్లాడించారు.

మతిస్థిమితం లేకుండా మాట్లాడు తున్న మాజీ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ తరఫున సవాల్ విసురుతున్నాము. రేపు గంగా ధర బాలుర గురుకుల పాఠశాలకు వస్తే వి ద్యార్థులకు ఎటువంటి భోజనం అందుతుం దో, విద్యార్థులు ఎంత సంతోషంగా ఉన్నారో చూపిస్తామన్నారు. ప్రతిరోజు ఏదో ఒక అబద్ధపు ప్రచారానికి తెర లేపడం, పేపర్లలో ఫో టోలు వేయించుకోవడం, ఆ ఫోటోలను చూసుకొని ఆయనకు ఆయనే సంబరపడ డం ఆయన పరిస్థితికి అద్దం పడుతుంది అ న్నారు.

ఎమ్మెల్యేగా గత ఐదేళ్లలో గురుకుల పాఠశాలలకు మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో ఏడాదిన్నర కాలంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తామని తెలిపారు.అబద్ధపు ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తే, కాంగ్రెస్ పార్టీ తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు.