21-08-2025 12:51:35 AM
కరీంనగర్, ఆగస్టు 20 (విజయక్రాంతి) : కరీంనగర్ ఉమ్మడి జిల్లా లో రైతులు వ ర్షాన్ని లెక్క చేయకుండా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్న తిప్పలు తప్పడం లేదు. క రీంనగర్ , జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలో రైతులు యూరియా కోసం ఇ బ్బందులు పడుతున్నారు. అవసరం మేర ఇవ్వడం అందని పరిస్థితులు నెలకొన్నాయి. ఒక ఎకరానికి మూడు దఫాల్లో 95 నుంచి 95 కిలోల యూరియా వాడాలి.
నాటు వేసి న పది పదిహేను రోజుల్లో 30 కిలోలు, పిల క దశలో 35 కిలోలు, పొట్ట దశలో మరో 30 కిలోలు వాడితే సరిపోతుంది. కానీ, ఇ ప్పుడు అధికారులు మాత్రం ఒక రైతు ఎన్ని ఎకరాల్లో పంట సాగు చేశాడు ఎన్ని యూరి యా బస్తాలు అవసరం అనే అంశం పరిశీలించకుండా ఒకటి లేదా రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్నారు.ఆధార్ కార్డును ప్రాతిపదికగా తీసుకుంటు యూరియా ఇస్తున్నా రు.
ఒక చోట తీసుకుంటే మరెక్కడైనా తెచ్చుకునేందుకు వీలు లేకుండా ఈ పాస్ మిష న్లలో ఆధార్ కార్డు ఎంట్రీ చేస్తున్నారు. ఒకటి కంటే ఎక్కువ ఎకరాలు పంట సాగు చేసిన వారి పరిస్థితి ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నా రు. రైతుల అవసరాన్ని బట్టి పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నా, ఇవ్వడం లేద ని ఆరోపణలు ఉన్నాయి.ప్రభుత్వం మార్క్ఫె డ్ ద్వారా, ప్రైవేట్ డీలర్ల ద్వారా యూరియా అమ్మకాలు సాగిస్తున్నది.
మార్క్ఫెడ్ ద్వారా సింగిల్ విండోలు, ఆగ్రో, గ్రోమోర్ సెంటర్ల కు సరఫరా చేస్తున్నది. అక్కడి నుంచి రైతులకు అందిస్తున్నది. ప్రైవేట్ డీలర్లకు ఆయా కంపెనీల నుంచి కేటాయింపులు జరుగుతుండగా, వీటిని అధికారుల పర్యవేక్షణలోనే పంపిణీ చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పు డు దాదాపు అన్ని డీలర్ దుకాణాల్లో యూ రియా నిల్వలు నిండుకున్నాయి. మార్క్ఫెడ్ వద్ద కూడా పెద్దగా లేవు.
జిల్లా ఇంచార్జి మం త్రి అయిన వ్యవసాయ శాఖ మంత్రి తు మ్మల నాగేశ్వర్ రావు సోమభారం వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి సమీక్షించిన పరిస్థితుల్లో మార్పు రాలేదు. రామగుండంలో ఉ న్న ఆర్‌ఎఫ్సీఎ్పనే రైతులు ఆశలు పెంచుకుంటున్నారు. ఈ ఎరువుల కర్మాగారం నుంచి ప్రతి సీజన్లో రాష్ట్రానికి 60 వేల మెట్రిక్ ట న్నుల ఎరువులు ఇవ్వాలని ఒక నిబంధన ఉంది.
ఈ నిబంధన ప్రకారం ఇప్పటి వరకు కొన్ని ఎరువులు, ముఖ్యంగా యూరియా సరఫరా చేసినట్టు తెలుస్తున్నది. అయితే ఈ కార్మాగారంలో తరుచూ ఉత్పత్తి నిలిచిపోతున్నది. సాంకేతిక కారణాల వల్ల ఈ నెల 14 నుంచి యూరియా ఉత్పత్తి ఆగిపోయింది. ఈ నెల 22 తర్వాతనే తిరిగి ఉత్పత్తి ప్రారంభించే అవకాశముంది. అయితే తెలంగాణ వాటా అందిస్తారా అన్నది అనుమానమే.
మండలంలో యూరియా కొరత ఉంది
యూరియా బోయిన్పల్లి మండలంలో కొరత అధికంగా ఉంది. వ్యవసాయ అధికారులు ఎకరానికి 30 కిలోల చొప్పున ఇవ్వ డం రైతులకు ఏ విధంగా సరిపోతుంది. ప్ర భుత్వం ఈ విషయంలో రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయవలసిన అవస రం ఉన్నది. రైతులు అవసరమున్న మేరకే యూరియా తీసుకెళ్తారు అదనంగా తీసుకెళ్లవలసిన అవసరం ఎందుకుంటుంది. ప్రభు త్వం ఇప్పటికైనా రైతులకు సరిపడా యూరి యా సరఫరా చేయాలి.
దావు కనకయ్య, రైతు, విలాసాగర్, బోయినపల్లి మండలం
వారం నుండి తిరుగుతున్నాం
వారం రోజు ల నుండి హుజురాబాద్ ప్రాథమిక వ్యవసా య కేంద్రం వద్దకు వస్తున్నాం పోతున్నాం తప్ప ఒక బస యూరియా కూడా దొరకడం లేడు. ప్రభుత్వం చొరవ చూపి యూరియా అందేటట్లు చూడాలి.
రజిత, మహిళా రైతు, సిర్సపల్లి
రెండు నెలల గడుస్తుంది యూరియా ఇప్పటివరకు దొరకలేదు
రెండు నెలల నుండి పొలం నాటు వేసి యూరియా కోసం తిరుగుతున్న దొరకడం లేదు. అధికారులతో మాట్లాడినప్పటికీ ఫలితం లేదు. ఏ టైం కి వస్తుందో ఎవరు తీసుకోబోతున్నారో తెలియడం లేదు.
సమ్మయ్య, రైతు, హుజురాబాద్
అతి కష్టం పైనే యూరియా:
పూర్తిస్థాయిలో యూరియా కొరత లేనప్పటికీ రైతులకు అతి కష్టంపైనే యూరియా రైతులకు అందడం జరుగుతుంది. రైతులకు సరిపోయే యూరియా అధికారులుసమకూర్చాలి.
బందారపు బాల్ రెడ్డి, ఎల్లారెడ్డిపేట