calender_icon.png 21 August, 2025 | 9:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాంకేతిక విప్లవానికి నాంది పలికిన మహానేత రాజీవ్

21-08-2025 12:55:42 AM

జగిత్యాల అర్బన్, ఆగస్టు 20(విజయ క్రాంతి): దేశంలో సాంకేతిక విప్లవానికి నాం ది పలికిన మహానేత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అ డ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు ధర్మపురి పట్టణంలో రాజీ వ్ గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రాజీవ్ గాం ధీ చిత్ర పటానికి పూలమాల వేసి ఘ నంగా నివాళులు అర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ నాటి ప్రధానమంత్రి గా రాజీ వ్ గాంధీ దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికి ప్రపంచంతో పోటీ పడే స్థాయి కి భారత్ను చేర్చిన దూరదృష్టి గల నాయకుడు అని అన్నారు. దేశంలో మతసామర స్యం కోసం సద్భావన యాత్ర చేపట్టారన్నారు.కంప్యూటర్ రంగానికి పెద్ద ఎత్తున ప్రాధాన్యతనిచ్చిన ఫలితంగానే నేడు ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఐటీ రంగంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.

అంతర్జాతీయ విమానాశ్రయాల రూపకల్పన, 18 ఏళ్ల యువతకు ఓటు హక్కు, గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు చేరే విధానాన్ని ఆయన ప్రవేశపెట్టారని గుర్తు చేసారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ధర్మపురి గోదావరి వరద ఉధృతిని పర్యవేక్షించిన మంత్రి లక్ష్మణ్ కుమార్

గోదావరి నదిలోకి వస్తున్న భారీ వరద దృష్ట్యా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అ డ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం ధర్మపురి గోదావరి తీరాన్ని అధికారులు, నాయకులతో కలిసి పర్యవేక్షించారు.ఈ సందర్భంగా మంత్రి మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ అధికారులకు గోదావరి పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.

గోదావరికి వచ్చే భక్తులు లోపలికి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని, ఎల్లప్పుడూ గజ ఈతగాళ్లను అందుబాటు లో ఉంచాలని,లోతట్టు ప్రాంతాల్లో నివసిం చే ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.అలాగే ఏవైనా అత్య వసర పరిస్థితులు తలెత్తిన వెంటనే తనకు సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట రెవెన్యూ అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలుపాల్గొన్నారు.

వరదల్లో గల్లంతై మరణించిన కుటుంబాలను పరామర్శించిన మంత్రి  

 జగిత్యాల పట్టణంలోని టి ఆర్ నగర్ 47, 48 వ వార్డులకు చెందిన హసీనా, సమీనా, ఆఫ్రిన్ లు మహారాష్ట్ర నుండి తిరిగి వస్తుండగా ఉద్గిర్ జిల్లా కేంద్రం సమీపంలో వరదల్లో గల్లంతు అయి మరణించడంతో వారి కుటుంబ సభ్యులను రా ష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి లు పరామర్శించారు.ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడు తూ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తున్న సందర్భంలో ఇలాంటి ఘటన జరగడం దురదృ ష్టకరం అన్నారు.

బాబుకు మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. మరణించిన కు టుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉం టామని,వారు చిరు వ్యాపారాలు చేసుకోవడానికి మైనార్టీ వెల్ఫేర్ సంస్థ నుండి రుణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మరో మహిళ ఆచూకీ కోసం అక్కడి అధికారులతో మాట్లాడి తొందరలోనే ఆ మహిళ ఆచూకీ కూడా తెలిసే విధంగా చర్యలు చేపడతామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వారి కుటుంబాలకు హామీ ఇచ్చారు. మంత్రి వెంట కాంగ్రెస్ నాయకులు జిల్లా రవి , తిరుపతి ,సిరాజ్ , నాగేంద్రతదితరులున్నారు.