calender_icon.png 10 September, 2025 | 6:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల స్వయం పరిపాలన

05-09-2025 12:21:27 AM

మహబూబాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి) : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణ పరిధిలోని సెయింట్ జాన్స్ హై స్కూల్ లో గురువారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు స్వయం పరిపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలు నిర్వహించారు.

విద్యా బోధనలతో పాటు ప్రతిరోజు పాఠశాల ఉపాధ్యాయులు నిర్వహించే కార్యక్రమాలను చేపట్టి అబ్బురపరిచారు. ఈ సందర్భంగా పాఠశాల హెడ్మాస్టర్ అల్లం శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న నిగూఢతను వెలికితీయడానికి ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించినట్లు చెప్పారు.

ఈ సందర్భంగా డీఈవోగా గణేష్, హెచ్‌ఎం గా సిద్దు, ఉపాధ్యాయులుగా శ్రీమాన్ హిందూ, సునయన, త్రిష, వీరు విశేష ప్రతిభ చాటగా, వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శౌరెడ్డి, రమేష్, మహేష్, సుజాత, ఐలయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.