04-11-2025 12:00:00 AM
							మరిపెడ, నవంబర్3 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల టిఆర్‌ఎస్ పార్టీ మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు ట్రబుల్ షూటర్ తన్నీరు హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు ఇటీవల కాలంలో పరమపదించగా ఆదివారము డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్య నాయక్ డోర్నకల్ మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, మాజీ మంత్రి హరీష్ రావును హైదరాబాదులోని వారి నివాసంలో పరామర్శించి వారి తండ్రి సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
వారి వెంట ప్రముఖ కాంట్రాక్టర్ రామడుగు అచ్యుతరావు, మాజీ ఎంపీపీ గుగులోతు వెంకన్న,బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు రాంబాబు, రవీందర్, సుదర్శన్ రెడ్డి శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్లు ,మాజీ ఎంపీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.