calender_icon.png 7 August, 2025 | 10:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాతో టచ్‌లో మాజీ ఎమ్మెల్యేలు

07-08-2025 01:37:33 AM

  1. చాలామంది కాంగ్రెస్ నాయకులు సైతం మా వైపు చూస్తున్రు
  2. ప్రాజెక్టుల అవినీతిపై సీబీఐ విచారణ చేయించాలి
  3. 42 శాతం బీసీలకు రిజర్వేషన్ పేరిట కాంగ్రెస్ కుట్ర
  4. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు

కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి)/కాగజ్‌నగర్: బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలామంది కాంగ్రెస్ నాయకులు సైతం తమ వైపు చూస్తున్నారని పేర్కొన్నా రు. బుధవారం కాగజ్‌నగర్‌లోని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం అవినీతి, అక్రమాలకు పాల్పడిందని, పూర్తిస్థాయి విచారణ కోసం కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగా కాళేశ్వరం డ్రామా నడిపస్తున్నారని, ఈ రెండు పార్టీలు కలిసి వాస్తవాలను బయటకు రానివ్వడం లేదని ఆరోపించారు.

ప్రాణహిత ప్రాజెక్టును కాళేశ్వరానికి తరలించి తూ ర్పు ఆదిలాబాద్‌కు తీరని అన్యాయం చేశార ని, కొత్త డీపీఆర్‌ను తయారు చేసి కేంద్ర ప్రభుత్వాని కి ప్రతిపాదన పంపిస్తే ప్రాణహిత ప్రాజెక్టుకు నిధులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందని వెల్లడించారు. యూపీఏ హయాంలో 60 ఏం డ్లలో దేశంలో 75 విమానాశ్రయాలు నిర్మిస్తే, మోదీ ప్ర భుత్వం కేవలం 11 సంవత్సరాల్లోనే 75 ఎయిర్ పోర్టులను కట్టినట్టు తెలిపారు.

ఎన్‌ఐటీ, ఎ యిమ్స్ లాంటి విద్యాసంస్థలను ప్రారంభించిన ట్టు తెలిపారు. రాష్ర్ట ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశా రు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెబుతూ ముస్లిం వర్గాలకు లబ్ధి చేకూర్చేందుకు కుట్ర పన్నుతున్నారని వాపోయారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత రా హుల్‌గాంధీ కంటే, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నే ఎక్కువసార్లు ఆపాయింట్‌మెంట్ ఇచ్చారని పే ర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం గడిచిన 11 ఏం డ్లలో రాష్ట్రానికి 12 లక్షల కోట్ల నిధులు ఇచ్చినట్టు స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టే పథకాలు రాష్ట్రంలోని పేదలకు మేలు జరు గుతుంద ని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలకు కేంద్రప్రభుత్వం మంజూరు చేసే నిధులను దారి మళ్లి స్తు న్నారని ఆరోపించారు. రాష్ర్టంలో బీజేపీ అధికారంలోకి వస్తే ద్వితీయ, తృతీయ నగరాల అభి వృద్ధికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడించా రు.

అంతకుముందు ఎంపీ నగేశ్ మాట్లాడు తూ ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన రూ. 108 కోట్ల నిధులను ఇతర జిల్లాలకు మళ్లించారని, దీనిపై ప్ర జలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జీ వో నెంబర్ 49కు 2014, మార్చి 12వ తేదీన అ ప్పటి ఉమ్మడి రాష్ర్టంలో బెజ్జూర్‌లోని పావురాల గుట్టతో బీజం పడిందన్నారు. ప్రస్తుతం అదే పా ర్టీ జీవో తీసుకొచ్చిందని ఆరోపించారు.

ఎమ్మెల్యే హరీశ్‌బాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని గత ప్ర భుత్వం పూర్తిగా దివాలా తీయించిందని, దివాలా తీసిన రాష్ట్రానికి ప్రస్తు తం దివాలా కోరు సీ ఎంగా రేవంత్ రెడ్డి ఉన్నార ని ఎద్దేవాచేశా రు. డబుల్ ఇంజన్ రాష్ట్రాలు అభివృద్ధి చెందుతుండగా, రాష్ర్టంలో ప్రభుత్వానికి ఇ ంజన్ లేదని అ వహేళన చేశారు. నీళ్లు పారించాల్సిన కాళేశ్వర ంలో అవినీతి వరద పారించారని ఆ రోపించారు.

అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరంలో జరిగిన అవినీతితో పాటు బీఆర్‌ఎస్‌ను కూడా ప్ర శ్ని ంచనున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్టీ సె ల్ రాష్ర్ట అధ్యక్షుడు విజయ్, వన్ నేషన్ వన్ చైర్మన్ నాగేశ్వరరావు, మాజీ ఎంపీ వెంకటేశ్ నేత, జిల్లా మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.