07-08-2025 01:41:21 AM
హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): ఈ ఏడాది తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్ దేశానికి 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి చేయనున్నట్లు రాఫ్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడి ్డ తెలిపారు. తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్ 150 48) పట్ల ఫిలిప్పీన్స్ ఆసక్తితో ఉందని ఆయన అన్నారు. బుధవా రం ఢిల్లీలోని ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖా మంత్రి ఫ్రాన్సిస్కో పీటీ లారెల్ జూనియర్‌తో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పౌర సరఫరాల కమిషనర్ డీఎస్ చౌహాన్‌లు భేటీ అయ్యారు.
ఈ సం దర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ, ఆ దేశంతో వాణిజ్య సం బంధాలు బలోపేతం అయ్యేలా చర్చలు జరుపుతున్నామన్నారు. బియ్యానికి ఫిలిప్పీన్స్‌లో డిమాండ్ ఉందని, ఆ దేశానికి సరిపడా 2మిలియన్ మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఉంటుందని ఈ భేటీలో ఫిలిప్పీన్స్ మంత్రి చెప్పారన్నారు. తెలంగాణ నుంచి బియ్యంతో పాటు ధాన్యం, మొక్కజొన్నలు, ఎగుమతి చేస్తూ వాణిజ్య సంబంధాలు బలోపేతం చేసే దిశగా భేటీ జరిగిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
తెలంగాణకు చెందిన సోనా (ఆర్‌ఎన్‌ఆర్ 15048) ఎగుమతి చేసే ప్రతిపాదనకు ఫిలిప్పీన్స్ మంత్రి సా నుకూలంగా స్పందించినట్లు ఉత్తమ్ తెలిపారు. సానుకూలంగా జరిగిన ఈ భేటీ తెలంగాణ, ఫిలిప్పీన్స్‌ల మధ్య మరింత మైత్రిని పెంపొందింప చేసిందన్నారు. తెలంగాణను సందర్శించాల్సిందిగా ఫ్రాన్సిస్కోను ఆహ్వానించామని, అందుకు ఆయన సానుకూ లంగా స్పందించారని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు.