04-08-2025 11:25:06 AM
వేద సప్తాహన్ని ప్రారంభించిన మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): దైవ అనుగ్రహం ప్రతి ఒక్కరిని సన్మార్గంలో నడిపిస్తుందని మహబూబ్ నగర్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్(Former Municipal Chairman Anand Goud) అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడిలో వేద సప్తాహన్ని ప్రారంభించిన అనంతరం హోమం పూజా కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక వైపు ప్రజలు ఆసక్తి చూపిస్తూ మంచి వైపు ప్రయాణించాలని సూచించారు. దైవ అనుగ్రహం తోనే ఆరంభించబోయే ప్రతి పనిలోనూ విజయవంతంగా ముందుకు సాగడం జరుగుతుందని తెలిపారు.హేతువు ద్వారా మార్గ నిర్దేశం, హిందూ ధర్మ పునాదుల కల్పనకు తిరిగి తీసుకు వెళ్లే మహత్తర పూజా కార్యక్రమని పేర్కొన్నారు. మెరుగైన సమాజం, సంపూర్ణ ఆరోగ్యం ప్రతి ఒక్కరి దరి చేరాలని సంకల్పం దయానంద సరస్వతి స్వామి వారి ప్రధాన ధర్మ కర్తవ్యమన్నారు. ఈ కార్యక్రమంలో సత్తూరి చంద్రకుమార్ గౌడ్, దయానంద సరస్వతి పాఠశాల ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.