20-09-2025 02:15:38 PM
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రతిసారి కిషన్ రెడ్డిని నిందించడం సరికాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు(BJP Chief Ramchander Rao) అన్నారు. రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి భయం పట్టుకుందని రామచందర్(BJP Chief Ramchander Rao) ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్యవస్థ పూర్తిగా దుర్భర పరిస్థితుల్లో ఉందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం రాసిన లేఖ సీబీఐ ముందుందని తెలిపారు. ఎన్ డీఎస్ఏ నివేదిక ప్రకారమే కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్(PC Ghose Commission) విచారణ చేపట్టిందన్నారు. కమిషన్ సెలెక్టెడ్ గా విచారణ చేపట్టిందని చెప్పారు. కమిషన్ విచారణలో నిందితులు ఎవరన్నది తేల్చిందా?, పీసీ ఘోష్ విచారణ తర్వాత రాజకీయ నేతలను అరెస్టు చేశారా? అని రామచందర్ రావు ప్రశ్నించారు.