20-09-2025 02:19:15 PM
మంచిర్యాల (విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా మంచిర్యాల కార్మెల్ కాన్వెంట్ హై స్కూల్‌లో సద్దుల బతుకమ్మ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మను అలంకరించి, సంప్రదాయ గీతాల మధ్య ఆడిపాడుతూ ఆనందంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సిస్టర్, మేనేజ్‌మెంట్ సభ్యులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.