15 April, 2026 | 1:16 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

అధికార పార్టీ అండతో అధికారులు ఇష్టారాజ్యం

23-06-2025 05:26 PM

26 సార్లు కలెక్టర్ కు ఫోన్ చేశా..

ఎమ్మెల్యే ఒత్తిడితోనే అధికారులు తప్పుడు రిపోర్టులు.. 

గ్రీవెన్స్ డే లో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): అధికార పార్టీ నాయకుల అండతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య(Former MLA Chirumarthi Lingaiah) మండిపడ్డారు. సోమవారం ఆయన నల్లగొండ కలెక్టరేట్ గ్రీవెన్స్ డే(Grievance Day)లో పాల్గొని నకిరేకల్ నియోజకవర్గానికి సంబంధించిన పలు అర్జీలను జిల్లా కలెక్టర్ కి అందజేసి మాట్లాడారు. ఈ జిల్లా కలెక్టర్ కి ఇప్పటివరకు 26 సార్లు ఫోన్ చేసిన సమాధానం ఇవ్వలేదని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ప్రజా సమస్యలపై స్పందించనందుకే నేను డైరెక్ట్ గా కలెక్టరేట్ వచ్చానని తెలిపారు. నకిరేకల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి, చిన్నకాపర్తి మాజీ సర్పంచ్ బోయ వాణి శ్రీను అర్జీలను కలెక్టర్ చూసి దాటవేసే ప్రయత్నం చేశారని కొప్పుల ప్రదీప్ రెడ్డిపై రాజకీయ కుట్రతోనే ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. 

స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడితోనే అధికారులు తప్పుడు రిపోర్ట్ లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు రికార్డ్ తో కేతేపల్లి పంచాయతీ సెక్రటరీపై వేటు వేసారని అధికార పార్టీ నాయకుల ఆదేశాలతో అధికారులు పని చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలో అనేక సమస్యలపై గ్రీవెన్స్ డేలో అనేకమార్లు అర్జీలు ఇచ్చినా ఫలితం శూన్యమన్నారు. చిన్నకాపర్తి గ్రామంలో మాజీ సర్పంచ్ వ్యవసాయ క్షేత్రంలోనీ భవనాలను నేలమట్టం చేశారని కాంగ్రెస్ నాయకులకు న్యాయం చేయడం చేతగాక దౌర్జన్యం చేస్తున్నారని పేర్కొన్నారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులను అధికారులు, అధికార పార్టీ నాయకులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదు, అధికారులు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని  గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ పార్టీ నాయకులకే ఇస్తున్నారని తెలిపారు. అధికారుల దగ్గర పవర్ లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవస్థను నడిపిస్తున్నారని దుయ్యబట్టారు.