10-05-2025 12:00:00 AM
సారంగాపూర్, మే౯ (విజయక్రాంతి): సారంగాపూర్ మండలంలోని వంజర్ గ్రామ మాజీ సర్పంచ్ గోనె లస్మయ్య గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, ప్రాణాపా యస్థితిలో ఉన్నాడు.
తన ఆరోగ్యం కోసం ఇప్పటివరకు సుమారు రూ.28 లక్షల వరకు ఖర్చయ్యిందని కుటుంబసభ్యులు తెలిపారు. ఇక మీదట ఖర్చు చేసి, తనని బ్రతికించేంత ఆర్థ్దికస్తోమత తమకు లేదని ఎవరైనా ఆపన్న హస్తులు ఆర్థికంగా ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.