10-05-2025 12:00:00 AM
బెల్లంపల్లి అర్బన్, మే9: బెల్లంపల్లి శాంతిఖని భూగర్భ గనిని మందమర్రి జీఎం దేవేందర్ విజిట్ చేశారు. శుక్రవారం ఆయన ఆకస్మికంగా పర్యటించారు. ఉదయం షిఫ్టు లో శాంతిఖనికి వచ్చిన ఆయన అధికారులతో మాట్లాడారు. బొగ్గు ఉత్పత్తి, గని పరి స్థితిని కార్మికుల పరి తీరును తెలుసుకున్నారు.
అనంతరం గనిలోకి దిగారు. భూగర్భలో ఉత్పత్తి ప్రక్రియ పనితీరును పరిశీలించేందుకు విజిట్ చేశారు. ఆయన వెంట ఏజెంట్ అబ్దుల్ ఖదీర్, గని మేనేజర్ సంజయ్, గని రక్షణ అధికారి రాజు, గని సంక్షేమ అధికారి ఇ.రవి కుమార్, ఇతర అధికారులు అండర్ గ్రౌండ్ విసిటింగ్‌లో ఉన్నారు.