calender_icon.png 8 January, 2026 | 7:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దోమకొండలో పెన్షన్లు పంపిణీ పరిశీలించిన మాజీ జెడ్పీటీసీ

03-01-2026 08:18:30 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ  మండల కేంద్రంలోని దుబ్బ బంగ్లాలో శనివారం పెన్షన్ పంపిణీ ప్రక్రియను మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ పరిశీలించారు. సిబ్బందితో పెన్షన్  పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించారు.  పోస్ట్ మాస్తార్ సురేష్ కు, గడి కోట సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. మహిళలకు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పెన్షన్లను నేరుగా బ్యాంక్ ఖాతలో వేయాలని పింఛన్ దారులు మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ ను కోరగా ఇట్టి విషయము రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ, ఇంచార్జ్ మంత్రి సీతక్కకు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని పేర్కొన్నారు.  కార్యక్రమంలో ఏఎంసి డైరెక్టర్  గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.