calender_icon.png 27 July, 2025 | 9:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫర్టీ ఏఐ మేల్ ఫెర్టిలిటీ టెస్టింగ్

26-07-2025 01:09:02 AM

ఐవీఎఫ్ డే సందర్భంగా ప్రారంభించిన నటి లయ

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 25 (విజయక్రాంతి): ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఫర్టీ ఫెర్టిలిటీ కొత్త అడుగు వేసింది. మగవారి వీర్యకణాలను ఏఐ టెక్నాలజీ ద్వారా పరీక్షించేందుకు లెన్స్‌హుక్ X12 ప్రో (lenshooke x12 pro) సాంకేతికతను అందుబాటులోకి తెచ్చినట్టు సికింద్రాబాద్‌లో జరిగిన కార్యక్రమం లో వెల్లడించింది. ఈ కార్యక్రమాన్ని ప్రము ఖ సినీనటి లయ ప్రారంభించారు.

అలాగే ఫర్టీ 9 సేవల ద్వారా సంతాన సాఫల్యం పొందిన తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. టుగెదర్ ఇన్ ఐవీఎఫ్ క్యాంపెయిన్ పేరుతో కేక్ కటింగ్ నిర్వహించారు. మగవారిలో ఇంఫెర్టిలిటీ సమస్యల పరిష్కారం కీలకంగా మారింది. డిఎన్‌ఏ ఫ్రాగ్మెంటేషన్ సమస్యలు ఎక్కువగా ఉండడం మిస్ క్యారేజ్ రేట్లు పెంచుతోందని ఫర్టీ 9 ఫెర్టిలిటీ సంస్థ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి సి బుడి చెప్పారు. తీసుకొచ్చిన ఏఐ టెక్నాలజీ ద్వారా నిమిషాల వ్యవధిలో వేల సంఖ్యలో వీర్యకణాలను పరిశీలించి డీఎన్‌ఏ లోపాలను గుర్తించవచ్చని తెలుస్తోంది.

మగవారిలో వీర్యకణాల నాణ్యతను పెంచేందు కు తద్వారా సంతాన సమస్యలను పరిష్కరించవచ్చని డాక్టర్ జ్యోతి చెప్పారు. ప్రస్తుతం ఉన్న టెస్టింగ్ విధానాల్లో జరుగుతున్న పొరపాట్లను సమర్థవంతంగా అరికట్టేందుకు ఫర్టీ 9 ఏఐ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు.

ఇది కేవలం 6 నిమి షాల్లోనే  ఒక్కో శాంపిల్ నుంచి 3 వేల వీర్యకణాలను పరీక్షించే సామర్థ్యం కలిగి ఉంటుం దన్నారు. వీర్యకణాల సంఖ్య మోటాలిటీ డిఎన్‌ఏ సమస్యలు వంటి వాటిని ఏకకాలంలో ఏఐ గుర్తిస్తుందని వెల్లడించారు. ఐయూఐ చికిత్స కోసం 50 శాతం తగ్గింపు, ఐవీఎఫ్ చికిత్సపై 25శాతం తగ్గింపు జూలై 31 వరకు అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది.