calender_icon.png 27 July, 2025 | 12:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు బ్రెయిలీ కంప్యూటర్ పరిజ్ఞానం తప్పక అందాలి

26-07-2025 01:09:02 AM

కలెక్టర్ హరిచందన దాసరి

మలక్‌పేట్, జులై 25 (విజయ్‌క్రాంతి): అంద  విద్యార్థులకు బ్రెయిలీ లిపితో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం లో  రాణించే  విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ హరిచంద దాసరి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్ర వారం మలక్ పేటలోని  అంధ బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆక స్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అం దించే ప్రతి సదుపాయాన్ని  అంధ విద్యార్థులకు కల్పించాలని ఆదేశించారు.

విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఆరోగ్య పరిరక్షణలో భాగంగా మెడికల్ చెక్ అప్‌లు చేయించాలని, వసతి గృహం యొక్క  కాం పౌండ్ వాల్‌పై  ఐరన్ మెష్‌ను ఏర్పా టు చేయాలని ఆదేశించారు. భోజనా లు చేసేందుకు డైనింగ్ హాల్  కావాలని, సెక్యూరిటీ సదుపాయాలు కల్పిం చాలని, కొంత మందికి యుడిఐ కార్డు లు అందలేదని  విద్యార్థులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సెర్ప్, వైద్య శాఖల కు వివరాలు అందజేయాలని  ఆమె సూచించారు.  కార్యక్రమంలో  వయోవృద్ధుల శాఖ సహాయ సంచాలకులు  రాజేందర్, తహసీల్దార్  జయశ్రీ, హెచ్ ఎం  అస్రా ఫాతిమా పాల్గొన్నారు.