calender_icon.png 27 July, 2025 | 4:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్, బీజేపీలది రాజకీయ అక్రమ సంబంధం

26-07-2025 01:07:27 AM

మాజీ మంత్రి కేటీఆర్

హైదరాబాద్, జులై 25 (విజయక్రాంతి): రాష్ర్టంలో కాంగ్రెస్, బీజేపీల రాజకీయ అక్రమ సంబంధం నడుస్తున్నదని- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రీయ విద్యార్థి సేన పరిషత్‌ను శుక్రవారం బీఆర్‌ఎస్వీలో విలీనం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సోనియాగాంధీ రాసిన ఉత్తరంలో ఏముం దో కూడా చదవడం రాని రేవంత్‌రెడ్డి, అదే తనకు అస్కార్ అవార్డు అన్న వ్యాఖ్యలను చూస్తుంటే.. రేవంత్ డిగ్రీ ఫేక్ కావొచ్చని అనుమానం కలుగుతోందని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విద్యారంగాన్ని సంపూర్ణంగా పతనావస్థకు చేర్చిందని విమర్శించారు. తెలంగాణను దోచుకుంటు న్న రేవంత్‌రెడ్డిని మోదీ ప్రభుత్వం కాపాడుతుందని ఆరోపించారు. కాంగ్రెస్‌కి తెలం గా ణ ఏటీఎంలాగా మారిందని చెపుతున్న అ మిత్ షా..  కేంద్ర హోంమంత్రిగా ఉండి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

రేవంత్ ప్రభుత్వ అక్రమాలు, అవినీతిని నిరూపించే సాక్ష్యాలను కేంద్రప్రభుత్వానికి ఇచ్చినా ఇప్పటివర కు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆ పా ర్టీల అక్రమ సంబంధా నికి సాక్ష్యం అన్నారు. హెచ్‌సీయూ భూముల అమ్మకం విషయంలో రేవంత్‌రెడ్డికి సపోర్ట్ చేసి కమీషన్లు ఇప్పిచ్చిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌కి క్విడ్ ప్రో కో కింద రూ.1600 కోట్ల వరకు ఫోర్త్ సిటీ రోడ్డు కాంట్రాక్టును అప్పచెప్పారని ఆరోపించారు. దీనిపై రాహుల్‌గాంధీ మౌనం వహిస్తున్నారని విమర్శించారు.