3 June, 2026 | 1:47 AM

ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది..

03-06-2026 12:28 AM

మార్కెట్ కమిటీ చైర్మన్ వెంగళ్ రావు

నార్సింగి /చేగుంట, జూన్ 02: ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చేగుంట మార్కెట్ కమిటీ చైర్మన్ తాడెం వెంగళరావు స్పష్టం చేశారు. నార్సింగి మండల పరిధి గ్రామమైన నర్సంపల్లి, చేగుంట మండల పరిదిలోని పులిమామిడి, కిష్టా పూర్,లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ భాగ్యలక్ష్మి రాజేశ్వర్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్స్, కాంగ్రెస్ నాయకులతో మంగళవారం సందర్శించారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రైతులు ఇబ్బందులు పడకుండా, క్షేత్ర స్థాయి పరిశీలన చేసి, ఏమైనా సమస్యలు ఉంటే పరిశీలించి చర్యలు తీసుకుంటున్నామనీ తడిసిన ధాన్యాన్ని సైతం గిట్టుబాటు ధరకే కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, రైతులు అధైర్య పడవద్దని అన్నారు.

క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న లారీల, హమాలీల సమస్య ను లారీ ఓనర్లు, మిల్లర్లతో సమన్వయం చేసుకుని పరిష్కరిస్తున్నామని అన్నారు. మండలంలో మొత్తం 9 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వరి కొనుగోలు చేస్తున్నామని, అందులో 4 కేంద్రాలలో కొనుగోలు, తరలింపు ప్రక్రియ పూర్తి చేసుకున్నాయని తెలిపారు. మిగతా కేంద్రాలలో దాదాపు కొనుగోలు పూర్తి అయ్యాయని ఒక్కో కేంద్రంలో 3 నుంచి 4 లారీల వడ్ల వరకు మిగిలాయని, వాటి కొనుగోలు మరో మూడు నాలుగు రోజులలో పూర్తి చేసి మిల్లులకు ధాన్యం తరలిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ప్రభాకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మొహమ్మద్ ముజామిల్, రఫీ, అన్నం ఆంజనేయులు, స్టాలిన్ నర్సిములు, కాషాబోయిన శ్రీనివాస్, బల్ రెడ్డి, పక్కిర్ నాయక్,వార్డు సభ్యులు ఖలీల్, సంతోష్, సందీప్ పార్టీ జిల్లా నాయకుడు బాలరాజు గౌడ్, రాజేశ్వర్ గౌడ్, ఐకేపీ ఏపీఎం సృజన కుమార్ రెడ్డి, సీసీ శ్రీనివాస్ గౌడ్, జీ.పీ.ఓ నాగరాజు, నాయకులు ఎల్లం, సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు.