01-07-2025 07:09:41 PM
జడ్పీ సీఈఓ కే. నరేందర్...
పెద్దపల్లి (విజయక్రాంతి): జిల్లాలోని జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో ఫేషియల్ రికగ్నెన్షన్ హాజరు(Biometric Attendance) విధానం అమలు చేస్తున్నట్లు జడ్పీ సీఈఓ కే. నరేందర్(ZP CEO K. Narender) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగుల సమయపాలన, విధుల్లో పారదర్శతకు ఫేషియల్ రికగ్నెన్షన్ హాజరు విధానాన్ని అమలు చేయాలని పంచాయతీ రాజ్ & గ్రామీణ ఉపాధి కల్పన సంచాలకులు జి. సృజన జారీ చేసిన ఉత్తర్వులు, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అవసరమైన పరికరాలు కోనుగోలు చేసి ఆయా మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయములకు పంపించామని అన్నారు. విధులకు హాజరు, ఇంటికి వెళ్ళే సమయాల్లో ఉద్యోగులు సిబ్బంది అంతా బయోమెట్రిక్ హాజరు వేయాల్సి ఉంటుందని, దీంతో ఉద్యోగులు, సిబ్బంది కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేసే అవకాశము ఉంటుందన్నారు.