calender_icon.png 1 July, 2025 | 11:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వర్షాల విపత్తుల వల్ల ప్రాణనష్టం జరగకుండా సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి

01-07-2025 07:31:38 PM

ప్రజలకు ముందు జాగ్రత్త చర్యలపై అవగాహన కల్పించాలి..

జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్..

ములుగు (విజయక్రాంతి): ములుగు జిల్లాలో వర్షాకాలం నేపథ్యంలో ఒక్క ప్రాణనష్టం కూడా జరగకుండా సహాయక చర్యలు చేపట్టుటకు సిద్ధంగా ఉండాలని, గోదావరి నది, జంపన్న వాగు పరిసర ప్రాంతాల ప్రజలకు ముందు జాగ్రత్త చర్యలపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.(District Collector Divakara T.S.) జాతీయ విపత్తు ప్రతిస్పందన బృందం(NDRF)ను కోరారు. మంగళవారం జాతీయ విపత్తు ప్రతిస్పందన బృందం(ఎన్డీఆర్ఎఫ్) జిల్లాకు విచ్చేసిన సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ తన ఛాంబర్లో అదనపు కలెక్టర్ రెవిన్యూ సిహెచ్ మహేందర్ జి(Additional Collector Revenue CH Mahenderji)తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లాలోని రామప్ప, లక్నవరం సరస్సులు, గోదావరి నది, జంపన్న వాగు నీటి ప్రవాహం గతంలో జరిగిన సంఘటనల గురించి(ఎన్డీఆర్ఎఫ్) బృందంనకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... 10వ బెటాలియన్, విజయవాడ కమాండెంట్ ప్రసన్న కుమార్ ఆదేశాల ప్రకారం ఆర్ ఆర్ సి హైదరాబాద్ నుండి ఇన్స్పెక్టర్ ముకేష్ కుమార్ కమాండర్, ఏఎస్ఐ సుధీర్, హెడ్ కానిస్టేబుల్ జగదీష్ తో 28 మంది ఒక టీం జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మూడు మాసంల వర్షకాలం ముగిసే వరకు జిల్లాలో ఉంటుందని అన్నారు. గోదావరి నది, జంపన్న వాగు పరిసర ప్రాంతాలు ఊరటం, నార్లాపూర్, మేడారం నీటి ప్రవాహ ప్రాంతాలను పరిశీలించి, అకాల వర్షం, విపత్తుల నేపధ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎన్డీఆర్ఎఫ్ బృందంను కోరారు. ఎన్డీఆర్ఎఫ్ బృందంనకు కావలసిన అన్ని ఏర్పాట్లను సమకూర్చాల్సిందిగా జిల్లా పంచాయతీ అధికారికి సూచించారు.