01-07-2025 07:16:19 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): లయన్స్ క్లబ్(Lions Club) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో "డాక్టర్స్ డే" పురస్కరించుకొని మంగళవారం సేవలందిస్తున్న డాక్టర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ లయన్ నాంపల్లి శంకర్, ఉపాధ్యక్షులు లయన్ పీచు వెంకటరమణ రెడ్డి, సెక్రటరీ వేణుగోపాల్, లయన్ తారీక్, కోఆర్డినేటర్, కోశాధికారి శంకర్, జాయింట్ సెక్రటరీ సత్యనారాయణ స్వామి, విశ్రాంత ఉపాధ్యాయులు ప్రకాష్, జబ్బార్, హాస్పిటల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.