calender_icon.png 2 July, 2025 | 1:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్యులను సన్మానించిన స్టార్ లయన్స్ క్లబ్ ఆఫ్ అశ్వాపురం

01-07-2025 07:13:28 PM

అశ్వాపురం (విజయక్రాంతి): స్టార్ లయన్స్ క్లబ్ ఆఫ్ అశ్వాపురం(Star Lions Club of Aswapuram) ఆధ్వర్యంలో మంగళవారం జాతీయ వైద్యుల దినోత్సవం(National Doctors Day) సందర్భంగా అశ్వాపురం ప్రభుత్వ వైద్యశాల వైద్యులు సంకీర్తన, శివలను, గ్రామీణ వైద్యులు బోళ్ల సత్యనారాయణను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వైద్యో నారాయణో హరి అనే సూక్తిని నిజం చేస్తూ ప్రజల ప్రాణాలను రక్షిస్తున్న వైద్యులను ప్రెసిడెంట్ సత్య ప్రకాష్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ సంకీర్తన, శివలు మాట్లాడుతూ... అశ్వాపురం క్లబ్ ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షిస్తున్ననన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ దొడ్డ రమేష్, ట్రెజరర్ ఎన్ ప్రశాంత్, వైస్ ప్రెసిడెంట్ లు నంబూరు వెంకన్న, సాయినాథ్, జిఎల్టి కోఆర్డినేటర్ గుర్రం నాగేశ్వరరావు లయన్ వసంత్, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.