షార్ట్ సర్క్యూట్‌తో నాలుగు బైకులు దగ్ధం
- మంటలను అదుపులోకి తెచ్చిన హైడ్రా డిజాస్టర్ మేనేజ్మెంట్
తప్పిన పెను ప్రమాదం
జిన్నారం/ అమీన్ పూర్, మార్చి 30 విద్యుత్ ప్యానెల్ బోర్డులో షాట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి నాలుగు బైకులు అగ్నికి ఆహుతైన ఘటన ఐడియా బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారు జామున జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. వెంకట్రెడ్డి నగర్ కాలనీలో రియల్ వ్యాపారి ఉమామహేశ్వరరావుకు చెందిన జీ ప్లస్ త్రీ భవనంలో 16 పోర్షన్లను కిరాయికి ఇచ్చాడు.
వీటిలో 16 కుటుంబాలకు చెందిన 60 మంది నివాసం ఉంటున్నారు. సోమవారం తెల్లవారు సమయంలో కరెంటు ప్యానెల్ బోర్డు ద్వారా షార్ట్ సర్క్యూట్ అయి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న నాలుగు బైకులు మంటలు అంటుకొని మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో కిరాయికి ఉంటున్న సాందారం దొర గమనించి కిరాయిదారులకు సమాచారం ఇవ్వడంతో వారంతా వెనుక గేట్ ద్వారా ముందు గేట్ ద్వారా బయటకు వచ్చారు.
వెంటనే 100 డయల్ కాల్ రాగా పెట్రోలింగ్, ఫైర్ ఇంజన్ హైడ్రా డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్లు వెంబడే వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదని సీఐ రవీందర్ రెడ్డి తెలిపారు.




