04-01-2026 12:55:11 AM
డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్క హర్షం
హైదరాబాద్, జనవరి 3 (విజయక్రాంతి): అసెంబ్లీలో నాలుగు కీలక సవరణ బిల్లులకు అమోదం లభిం చింది. శాసన సభా సమావేశాల సందర్భంగా శనివారం ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కాగానే సభ్యు లు అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖల మంత్రులు సమాధానమిచ్చారు.
ఆ తర్వాత పలువురు ఎమ్మెల్యేలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తిరస్కరించారు. ఇక బిల్లుల సవరణలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మొదటగా పబ్లిక్ సర్వీసెస్ నియామకాల క్రమబద్ధీకరణ, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు, సిబ్బంది హేతుబద్ధీకరణ, వేతన నిర్మాణానికి సంబంధించిన బిల్లు (బిల్లు నెంబర్ 6), రెండో సవరణ బిల్లు (బిల్లు నెంబర్ 7) ప్రవేశపెట్టారు.
ఆ తర్వాత పంచాయతీరాజ్ చట్టానికి సబంధించి రెండు కీలక బిల్లులను (బిల్లు నెం.8, బిల్లు నెం9) మంత్రి సీతక్క ప్రవేశపెట్టారు. ఈ బిల్లులపై అసెంబ్లీలో చర్చించిన అనంతరం సవరణకు సభ ఆమోదం తెలపడంతో చట్టంగా మారాయి. బిల్లుల సవరణకు ఆమోదం తెలిపిన సభ్యులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు.