calender_icon.png 6 January, 2026 | 7:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా కేంద్రాల్లోనూ ఐటీని విస్తరిస్తాం

04-01-2026 12:56:38 AM

మలక్‌పేట ఐటీ ప్రాజెక్టుకు టెండర్లు పిలుస్తాం : మంత్రి శ్రీధర్

హైదరాబాద్, జనవరి 03 (విజయక్రాంతి): ఐటీ పరిశ్రమలను హైదరాబాద్ కేంద్రంగానే కాకుండా జిల్లా కేంద్రాల్లోనూ విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నామని ఆ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. గ్రామీణ ప్రాంతా ల్లో నైపుణ్యమున్న విద్యార్థులున్నారని, అందరూ ఉద్యోగాల కోసం హైదరాబాద్ నగరానికి రాకుండా అక్కడే ఉద్యోగాలు చేసుకునేలా పరిశ్రమలను విస్తరిస్తామన్నారు.

శాసనమండలిలో శనివారం ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అడిగిన మలక్‌పేట ఐటీ టవర్ ప్రాజెక్టు ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఐటీ టవర్ ప్రాజెక్టుకు మళ్లీ టెండర్లు పిలిచే ప్రక్రియను మొదలుపెట్టామని చెప్పారు. ఐటీ రంగాన్ని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించేలా మౌలికవసతులు, అనుమతులు, ప్రోత్సాహాలను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.