25-12-2025 02:24:43 AM
మెదక్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆసియా ఖం డంలోనే రెండో అతిపెద్ద చర్చిగా పేరొందిన ఈ మహాదేవాలయం 101వ వసంతాల వేడుకలకు సిద్దమైంది. ఈ వేడుకలను తిలకిం చేందుకు దేశ, విదేశాల నుంచి ప్రజలు తరలిరానున్నారు. క్రిస్మస్ సందర్భంగా 590 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొననున్నారు. మెదక్‌తో పాటు సిద్దిపేట, కామా రెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన పోలీ సు సిబ్బంది పాల్గొంటున్నారు.
మెదక్ ప్రాం తంలో వందేండ్ల కింద 1914లో తీవ్రమైన కరువు తాండవించింది. తినడానికి తిండిలేక ప్రజలు అలమటిస్తున్న ఆ రోజుల్లో ఇంగ్లాం డ్ దేశానికి చెందిన చార్లెస్ వాకర్ పాస్నెట్ క్రైస్తవ గురువుగా ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఈ ప్రాంత దుస్థితిని చూసి చలించిన ఆయన ఏసుక్రీస్తు మందిర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీంతో అప్పటి నిజాం ప్ర భువు మీర్ ఉస్మాన్ అలీఖాన్ చర్చి నిర్మాణానికి 120 ఎకరాల భూమిని ఉచితంగా అందించారు.
పనికి ఆహారంతో నిర్మితమై..
చార్లెస్ వాకర్ అనుకున్నదే తడువుగా చర్చి నిర్మాణానికి అంకురార్పణ చేయడమే కాకుండా పనికి ఆహార పథకం కింద ఈ ప్రాంత పేదల కడుపు నింపారు. 1914లో చర్చి నిర్మాణం ప్రారంభమైంది. పదేళ్ల పాటు కొనసాగిన పనులు 1924లో పూర్తయ్యాయి. చర్చి నమూనాను ఐరోపా గోథిక్ శైలిలో ఆంగ్ల ఇంజినీర్ బ్రాడ్షా రూపొందించగా, వాస్తుశిల్పిగా థామస్ ఎడ్వర్డ్ వ్యవహ రించారు.
ఇటలీతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిర్మాణరంగ నిపుణు లు భాగస్వాములయ్యారు. 200 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పుతో రెండంతస్తుల్లో నిర్మించిన చర్చికి 175 అడుగుల ఎత్తున గోపురం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. చర్చిలో ఒకేసారి ఐదు వేల మంది ప్రార్థనలు చేయొచ్చు. చర్చి లోపల ప్రతిధ్వని రాకుండా రబ్బరు, పత్తిని వినియోగించి పైకప్పును వేశారు.