08-02-2025 12:12:11 AM
ముంబై, ఫిబ్రవరి 7: మహాఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తు న అవకతవకలు జరిగాయని ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్, ఎన్సీపీ(ఎస్పీ) ఎంపీ సుప్రియా సులేతో కలిసి రాహుల్ శుక్రవా రం మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఆయన మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల మధ్య ఉన్న ఐదు నెలల సమయంలోనే సుమారు 39లక్షల మంది కొత్త ఓటర్లు చేరినట్టు పేర్కొన్నారు. ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా ఎన్నో అక్రమాలను గుర్తించినట్టు తెలిపారు. ప్రభుత్వ డాటా ప్రకారం మహారాష్ట్రలో 9.5 4కోట్ల మందికే ఓటు వేసే అర్హత ఉండగా.. ఎన్నికల్లో మాత్రం 9.7కోట్ల మంది ఓట్లు వే సినట్టు వివరించారు.
కొత్తగా ఓటర్ల జాబితా లో చేరిన 39 లక్షల మంది ఓటర్లు ఎవరు? రాష్ట్రంలోని మొత్తం వయోజన జనాభా కం టే ఎక్కువ మంది ఓటర్లు ఎందుకు ఉన్నా రు? అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
కాగా రాహుల్ ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సం ఘం స్పం దించింది. రాజకీయ పార్టీలు లేవనెత్తిన ప్రశ్నలు, సూచనలను గౌరవిస్తామని ఈసీ తెలిపింది. దేశ వ్యాప్తంగా ఒకేలా తా ము అనుసరించిన విధానపరమైన అంశాలతో త్వరలోనే లిఖితపూర్వక సమాధానం ఇవ్వనున్నట్టు పేర్కొంది.