08-02-2025 12:09:19 AM
తాజా పరిశోధనలో వెల్లడి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: భూమిపై మానవ కార్యకలాపాలు చంద్రుడిపై ఉష్ణోగ్రతను ప్ర భావితం చేయలేవని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కొవిడ్ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడం వల్ల చంద్రుడిపై ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో తగ్గా య ంటూ గత ఏడాది కొందరు శాస్త్రవేత్తలు రా యల్ ఆస్ట్రోనామికల్ సొసైటీకి సంబంధించిన జర్నల్‌లో వ్యక్తపరిచిన అభిప్రాయాన్ని తాజా అధ్యయనం కొట్టిపారేసింది.
కొవిడ్ సమయమైనా లేక మరే ఇతర సమయం లోనైనా భూమిపై జరిగే మానవ కార్యకలాపాలు చంద్రుడిపై ఊష్ణోగ్రతలను ప్రభావి తం చేయలేవని మిస్సోరీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్ వెస్టిండీస్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా జరిపిన తమ పరిశీలన ద్వారా కనుగొన్నా రు. లాక్‌డౌన్‌కు ముందు 2018లో కూడా చంద్రుడిపై ఉష్ణోగ్రతలు తగ్గాయని శాస్త్రవేత్తలు తమ పరిశీలన పత్రాల్లో పేర్కొన్నారు. అలాగే 2019లో కూడా స్థిరమైన తగ్గుదల కనిపించినట్టు వెల్లడించారు.