29-04-2025 06:17:00 PM
పాఠ్యపుస్తకాలు నోట్ బుక్స్ షూ పంపిణీ..
మన ఊరి పిల్లల్ని మనబడిలోనే చేర్పించండి..
పలివెల పాఠశాల ఉపాధ్యాయులు..
మునుగోడు (విజయక్రాంతి): కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలలో ఉచిత విద్య బోధించబడుతుందని పలివెల జెడ్పిహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయులు అన్నారు. మంగళవారం మండలంలోని పలివేల గ్రామంలో ముందస్తు పడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయుల వినూత్న ప్రచారం విద్యార్థులతో కలిసి నిర్వహించి మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలల ఫీజులు భారం తగ్గించండి అనే నినాదంతో బడిబాట కార్యక్రమాన్ని పాఠశాల ఉపాధ్యాయులు పెరిక నరసింహ కాటేపల్లి లక్ష్మీ నరసయ్య, గేర నరసింహ అనే ఉపాధ్యాయులు ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులు తల్లిదండ్రుల వద్దకు వెళ్లి మీ పిల్లల్ని మన ఊరు బడిలోనే చేర్పించాలని అన్నారు.
బడిలో అనేక సౌకర్యాలు ఉన్నాయని ఉచితమైన నాణ్యమైన విద్యను మేము బోధిస్తామని అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ప్రతి సబ్జెక్టుకు ఇద్దరు ఉన్నారని డిజిటల్ బోధన, కంప్యూటర్ విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్కులు ఈ సంవత్సరం నుండి విద్యార్థులకు ఉచితంగా షూస్, ఐడి కార్డు, అందజేసి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా పాఠశాలను క్రమశిక్షణతో నడుపుతామని పిల్లని చేర్పించాలని, ఇంగ్లీష్ మీడియంలో ఆరో తరగతి నుండి పదవ తరగతి వరకు ఉచితంగా బోధిస్తున్నామని ఊరి బడిలోనే మీ పిల్లలు చేర్పించాలని విద్యార్థులు తల్లిదండ్రులను కోరారు.
అదేవిధంగా ఈ సంవత్సరం విద్యార్థుల కొరకు ప్రత్యేకంగా సమ్మర్ క్యాంపును మన పాఠశాలలో నిర్వహిస్తున్నామని వేసవి సెలవులు అయినప్పటికీ ఉపాధ్యాయులు పెరిక నరసింహ, ఉయ్యాల యాదయ్య, కాటేపల్లి లక్ష్మీ నరసయ్య, గేర నరసింహ అనే ఉపాధ్యాయులు ప్రతి రోజుకు ఇద్దరు చొప్పున పాఠశాలకు వచ్చి విద్యార్థులకు ఉచితంగా స్పోకెన్ ఇంగ్లీష్, తెలుగు, గణితం, ఫిజిక్స్ మొదలైన వాటిలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నామని అన్నారు. గ్రామస్తులంతా ఒకటై ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా కట్టడి చేయాలని అన్నారు. ఇంగ్లీషు మీడియంలో చక్కని బోధన చేసే అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో బోధనను అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు శ్రీజ, శృతి, బాలాజీ, పాల్గొన్నారు.