21-07-2025 12:07:38 AM
హుజూర్ నగర్, జూలై 20 : తెలంగాణ రాష్ట్రంలోని రజకుల లాండ్రీ షాపుల ఉచిత విద్యుత్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని తెలంగాణ రజక సేవా సంఘం జిల్లా అధ్యక్షులు చెరుకు వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం పట్టణంలోని టౌన్ హాల్లో నియోజకవర్గ స్థాయి రజకుల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు...
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత రజకుల, నాయి బ్రాహ్మణుల ఉచిత విద్యుత్ బిల్లులు చెల్లించడంలో,కావలసిన నిధులు కేటాయించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు.హుజూర్ నగర్ నియోజకవర్గ రజక సేవా సంఘం నూతన కమిటీ అధ్యక్షులుగా కొమరాజు లక్ష్మయ్య,ఉపాధ్యక్షులుగా చిక్కుళ్ళ లింగయ్య, కార్యదర్శిగా చిలక రాజు జానయ్య, కోశాధికారిగా పోతురాజు వెంకటయ్య, సహాయ కార్యదర్శిగా తిరుమలగిరి గోవింద్, కమిటీ సభ్యులుగా చిలక రాజు వెంకట్, పెద్దారపు పున్నయ్య, కృష్ణ, సైదులు తదితరులు పాల్గొన్నారు.