21-07-2025 12:06:09 AM
జిల్లా ఉత్తమ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్‌గా వస్కుల సత్యనారాయణ
దేవరకొండ, జూలై 20: దేవరకొండ లయన్స్ క్లబ్ విద్య, వైద్య ఆరోగ్య కార్యక్రమాలను నిర్వహించడంలో ప్రథమ శ్రేణిలో నిలవడం జరిగిందని నల్గొండ జిల్లా లయన్స్ క్లబ్ గవర్నర్ యానాల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండలో జరిగిన కార్యక్రమంలో 2024- 25 సంవత్సరానికి గాను మూడు విభాగాలలో అవార్డులను బహకరించడం జరిగిందని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 25 సంవత్సరానికి గాను అన్ని రంగాలలో అత్యుత్తమ సేవలు అందించి ఉత్తమ ప్రెసిడెంట్ గా లయన్ వస్కుల సత్యనారాయణ ఉత్తమ, సెక్రెటరీగా సముద్రాల ప్రభాకర్ జడ్సీగా వనం బిక్షమయ్య లకు బహుకరించామని తెలిపారు. వీరితోపాటు క్లబ్బుకు 16 అవార్డులను కైవసం చేసుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా వస్కుల సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లా అవార్డు రావడం సంతోషంగా ఉందని తెలిపారు.
తన అవార్డులో లయన్స్ క్లబ్ సభ్యుల సహకారం దాతల సహకారం మరువలేనిదని తెలిపారు. ప్రతి క్లబ్బు సైతం ప్రణాళికతో సేవా కార్యక్రమాలను రూపొందించుకొని ముందుకు పోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం జె ఎఫ్ గాజుల రాజేష్ , సెక్రెటరీ లకుమారపు మల్లయ్య, లయన్స్ క్లబ్ జెడ్ సి వనం శ్రీనివాసులు , పగిడిమర్రి శ్రీనివాసులు లు పాల్గొన్నారు.