calender_icon.png 22 July, 2025 | 10:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా కొరత నివారించాలి

21-07-2025 12:08:44 AM

ఏఐకెఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు మట్టయ్య, రమేష్

మిర్యాలగూడ, జూలై 20: పంట సాగు ప్రారంభం అయినందున రాష్ట్రములో యూరియా కొరత నివారించాలని ఏ ఐ కే ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వస్కుల మట్టయ్య, పెద్దారపు రమేష్ లు ఆదివారం కోరారు. ఈ మేరకు   అఖిల భారత రైతు సమాఖ్య రాష్ట్ర ప్రతినిధులు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ని కలిసి వినతిపత్రం ఇచ్చినట్లు పేర్కొన్నారు.

కార్యక్రమం లో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వల్లెపు ఉపేందర్ రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి యన్ రెడ్డి హంసరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమార స్వామి, పోతుగంటి కాశి, కిరణ్, ఇమ్మానుయేల్ తదితరులు పాల్గొన్నారు.