06-09-2025 10:29:50 PM
ఈ నెల 8న వేములవాడ మాతృశ్రీ హాస్పిటల్ లో ఏర్పాట్లు
అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలి
లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ సంతోష్ కుమార్
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): రేకుర్తి కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో లయన్స్ క్లబ్ ఆఫ్ వేములవాడ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన సోమవారం ఉచిత కంటి ఆపరేషన్ శిబిరం నిర్వహించనున్నారు. ఈ మేరకు వేములవాడ పట్టణంలోని మాతృశ్రీ హాస్పిటల్ లో ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం ఉదయం 09.00 గంటల నుంచి మధ్యాహ్నం 02.00 గంటల వరకు శిబిరం నిర్వహించనున్నారు. ఆపరేషన్ చేయించుకోవాలనుకునే వారు.ఆపరేషన్ చేయించుకోవాలనుకునే వారు తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులు, రూ. 220 రక్తం పరీక్ష కోసం చెల్లించాలి. తినడానికి ఒక ప్లేట్, గ్లాస్, రెండు దుప్పట్లు వెంట తీసుకురాగలరు. ఉచిత బోజన వసతి కల్పించడం జరుగుతుంది.
ఉచితంగా బస్సులో తీసుకువెళ్లి మళ్లీ..
కంటి ఆపరేషన్ చేయించుకునే వారిని వేములవాడ నుంచి రేకుర్తి కంటి ఆసుపత్రికి ఉచితంగా బస్సులో తీసుకువెళ్లి, మళ్లీ తీసుకురావడం జరుగుతుంది. ఆపరేషన్ చేసిన తర్వాత ఉచితంగా మందులు, కంటి అద్దాలు ఇవ్వబడును.సద్వినియోగం చేసుకోవాలి.కంటి ఆపరేషన్ చేయించుకునే వారు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని లయన్స్ క్లబ్ వేములవాడ అధ్యక్షుడు డాక్టర్ సంతోష్ కుమార్ కోరారు. కావలసిన పత్రాలు వెంట తీసుకురావాలి. పూర్తి వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లుడాక్టర్ సంతోష్ కుమార్- 90003 02223, లయన్ బచ్చు వంశీకృష్ణ - 91776 81744, లయన్ డాక్టర్ కోయినేని ప్రవీణ్ - 97044 28009.