06-09-2025 10:35:54 PM
ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదివాసి ముద్దు బిడ్డ తొడసం కైలాస్ టీచర్ వృత్తి చేస్తూ తనలోని కలను మెరుగుపెడుతూ మహాభారతాన్ని గోండి భాషలో రచించిన రాష్ట్రపతి అభినందనలతో పాటు భారత ప్రధాని సైతం మంకీ బాత్ కార్యక్రమంలో తుడసం కైలాష్ గొప్పతనాన్ని వివరించడం జిల్లాకే గర్వించదగ్గ విషయమని మాజీ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. వాఘాపూర్ గ్రామ నివాసి తోడసం కైలాస్ తను స్వహస్తాలతో మహాభారతాన్ని గోండి భాషలో రూపొందించడం, కాకుండా 360 పాటలను ఆదివాసి సంస్కృతిక భాషలో లికించి ప్రశంసలు పొంది జిల్లాకు గర్వకారంగా నిలిచారన్నారు.
శనివారం తొడసాం కైలాస్ తో పాటు వారి కుటుంబ సభ్యులను వారి నివాసంలో కలిసిన మాజీ మంత్రి వారిని అభినందించారు. శాలువాతో ఘనంగా సత్కరించి, తనకున్న కళ పోషణను అడిగి తెలుసుకుని వారు చేసిన కృషిని పూర్తి సహకారం ఉంటుందన్నారు. కళాకారులకు పేదరికం అడ్డు రాదని ధైర్యంగా కలను ప్రదర్శించినప్పుడే తన పేరు సార్థకతమవుతోందని, ఉన్నత లక్ష్యాన్ని చేరుకోగలుగుతుందన్నారు.