24-07-2025 05:58:35 PM
మహదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) మహాదేవపూర్ మండలంలోని బ్రాహ్మణపల్లి, కాలేశ్వరం గ్రామాలలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ సుస్మిత తెలిపారు. గురువారం బ్రాహ్మణపల్లి ఎస్సీ కాలనీలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించగా ఈ శిబిరాలకి 40 మంది అనారోగ్య సమస్యలతో రావడం జరిగిందని వారి అనారోగ్య సమస్యలు తెలుసుకొని మందులు పంపిణీ చేసి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ డ్రైడే నిర్వహించి, సీజనల్ వ్యాధులకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు.
నంతరం కాళేశ్వరంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి 50 మంది రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. కాలేశ్వరం గ్రామంలో కూడా డ్రై డే గురించి ప్రజలకు సీజనల్ వ్యాధుల గురించి అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వినయ్, పి హెచ్ ఎన్ నీరజ, హెల్త్ సూపర్వైజర్ రాజా రమణయ్య, సమ్ము, ఏఎన్ఎం హేమలత, వెంకటమ్మ, ఐసిటిసి కౌన్సిలర్ హరికృష్ణ, ఆశాలు శ్రీలత, సుశీల, ప్రేమలత, శైలజ, రుద్ర, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.