calender_icon.png 7 August, 2025 | 7:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు

24-07-2025 06:01:06 PM

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రం కొండాపూర్ వద్ద గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం కేటీఆర్(KTR) జన్మదినాన్ని పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా కో ఆర్డినేటర్ కే రామ్ కిషన్ రెడ్డి కేక్ కట్ చేసి పంచిపెట్టారు. హ్యాపీ బర్త్డే కేటీఆర్ అంటూ.. నినాదాలు చేశారు. అనంతరం స్థానిక ప్రసూతి ఆసుపత్రిలోని గర్భిణీలకు పండ్లు, బ్లడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మారుగోండ రాము, జాగృతి జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ చారి, బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ రిజ్వాన్ ఖాన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.