29-07-2025 06:17:25 PM
కన్నాయిగూడెం (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) కన్నాయిగూడెం మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ముప్పనపల్లి గ్రామంలో కస్తూర్బాగాంధీ పాఠశాలలో డాక్టర్ అభినవ్ ఆదేశాల మేరకు డాక్టర్ స్నేహరెడ్డి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 55 విద్యార్థులకు జలుబు దగ్గు తలనొప్పి జ్వరంతో కడుపు నొప్పితో బాధపడే వారిని పరీక్ష చేసి వారికి మందులు ఇవ్వడం జరిగింది. విద్యార్థులకు వ్యక్తిగత శుభ్రత మరియు పరిసరాల శుభ్రత పోషకాహార విలువలను గురించి హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. హాస్టల్లోని భోజనాన్ని వారు ఉండే ప్రాంతాలను పరీక్షించారు. ఇందులో హెల్త్ అసిస్టెంట్ లక్ష్మణ్ మరియు ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.