29-07-2025 06:15:45 PM
నిర్మల్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలోని మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల, కళాశాల(Mahatma Gandhi Jyotiba Phule Gurukul School & College)లో అతిథి ఉపాధ్యాయులు అధ్యాపకుల కాంట్రాక్ట్ నియమాల కోసం ఈనెల 31న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు ఆర్టీవో శ్రీధర్, డిసిఓ కీర్తి తెలిపారు. ఆంగ్ల మధ్యమంలో బోధించేందుకు ఇంగ్లీష్ 3, మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ జనరల్ సైన్స్ ఉన్నత పాఠశాలలో బోధించేందుకు పీజీ బీఈడీ నెట్ ఉన్నవారు ఇంటర్వ్యూ హాజరుకావాలని కోరారు.
ఇంటర్మీడియట్లో గణితం ఫిజిక్స్ కెమిస్ట్రీ చరిత్ర బోటనీ జూలాజికల్ బోధించేందుకు అతిథి ఉపాధ్యాయులు ఖాళీలు ఉన్నాయని అర్హులైన వారు వెంటనే ఈనెల 31 నా ఎంజెపి గురుకుల పాఠశాలలో నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు. డెమో ఆధారంగా పారదర్శకంగా ఎంపిక చేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని ఇతర వివరాలకు ఎం జె పి గురుకుల పాఠశాలలను సంప్రదించాలన్నారు ఇంటర్వ్యూలు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంజెపి గురుకుల పాఠశాలలో ఉదయం 10 గంటల నుంచి నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.