25-01-2026 07:43:41 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు సుగ్లాంపల్లిలో సితార హాస్పిటల్ వారి సౌజన్యంతో 1వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈర్ల శేఖర్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంకు అపూర్వ స్పందన లభించింది. ఈ ఉచిత వైద్య శిబిరంలో దాదాపు 200 మందికి పైగా స్థానికులు పాల్గొని వైద్య సేవలను సద్వినియోగంచేసుకున్నారు.
ఈ సందర్భంగా ఈర్ల శేఖర్ మాట్లాడుతూ... గ్రామ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ ఉచిత మెడికల్ క్యాంప్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్యాంప్‌లో బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని ఆయన తెలిపారు.
ఈ ఉచిత మెడికల్ క్యాంప్ కు సహకరించిన సితార హాస్పిటల్ యాజమాన్యానికి 1వ వార్డు ప్రజల తరఫున ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఈఎన్‌టీ వైద్యుడు డా. జాదవ్ రాజ్ కుమార్, జనరల్ ఫిజీషియన్ డా. సుప్రజతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు దుగ్యాల సంతోష్ రావు, తిరుపతి రావు, కలవేన రమేష్, కనుకుల సంతోష్, జంగ సతీష్, కొప్పుల నాగార్జున, అడిచర్ల పవన్, లక్ష్మీనారాయణ, పాపని సురేష్, తూడి శ్రీనివాస్, మారం అంజయ్య, చల్ల కుమార్ తదితరులు పాల్గొన్నారు.